దిన ఫలాలు (ఏప్రిల్ 2, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. మిథున రాశి ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతారు.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులకు మీ మీద నమ్మకం వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు కానీ, కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుతారు. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగి పోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నా ఆశించిన ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు అందుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో బాధ్యతల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొన సాగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో కొద్దిగా మార్పులు చేపట్టి సత్ఫలితాలు పొందుతారు. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి కొద్దిగా బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు మారే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.