Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఆగస్టు 5, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారు పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిథు రాశి వారు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి కాస్తంత అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండకపోవచ్చు. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలా వరకు బయటపడతారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులకు మీ మీద నమ్మకం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగినా అనుకూలతలకు లోటుండదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొందరు బంధుమిత్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

కుటుంబ జీవితం కొద్దిగా అసంతృప్తిగా సాగిపోతుంది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగంలో కొద్దిపాటి సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కుటుంబంలో కొద్దిగా టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సీదాసాదాగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభ వార్తలు వినే అవకాశముంది. ఆర్థికపరంగా కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. కుటుంబ ఖర్చుల్ని అదుపు చేసుకోవడం మంచిది. ఆరోగ్యం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. శుభ కార్యాలకు లేదా విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితంలో రాబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కుటుంబ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి తప్పకపోవచ్చు. పిల్లల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా నయమనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా కొనసాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు అతి వేగంగా పూర్తవుతాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. అదనపు ఆదాయం కొద్దిగా పెరు గుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాల నిస్తాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కుటుంబ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుం టాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు, ప్రత్యేక లక్ష్యాలు అప్పగిస్తారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

కుటుంబ సభ్యుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. శ్రమ, తిప్పట ఉన్నా కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేస్తారు. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆర్థికంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు చదువులు లేదా ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇష్టమైన మిత్రులతో ఆనందంగా గడుపు తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపడతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *