దిన ఫలాలు (జనవరి 17, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఇంటా బయటా ఆదరణ, గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కొందరు బంధు మిత్రులు మీ మీద ఆర్థికంగా ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో రాబడి వృద్ధి చెందుతుంది. వ్యాపారులు అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలక డగా సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగం మారే ప్రయత్నాలకు ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక వ్యవహారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయ త్నం తలపెట్టినా సఫలమవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచ నాలను మించుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం సజావుగా సాగిపో తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. కుటుంబ జీవితం సజావుగా సాగిపోతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి శుభవార్త అందుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ముఖ్యమైన లక్ష్యాలు, బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. నిరుద్యో గులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టాలి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభి స్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. సొంత పనుల మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఎక్కువగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరు గుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో సానుకూలత, సామరస్యం పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆదాయానికి లోటుండదు కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఆర్థిక సమస్యల ఒత్తిడి ఉంటుంది. పోటీదార్లు సమస్యలు సృష్టించే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన వ్యక్తులతో సన్ని హిత సంబంధాలు ఏర్పడతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు.