Horoscope Today: వారు ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (మే 5, 2025): మేష రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలపడుతుంది. వ్యాపారాల్లో మీ వ్యూహాలు, పథకాలు సత్ఫలితాలనిస్తాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన పనులన్నీ లాభ సాటిగా పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. ఒత్తిడి, శ్రమ బాగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులు, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు న్నాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా పని భారం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయపరంగా రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ లాభాలు గడిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పిల్లలతో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఫలి స్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో సానుకూలతలు పెరుగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి మార్పులతో కొత్త పుంతలు తొక్కుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

మీ నిర్ణయాలు, ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు దాదాపు రెట్టింపవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కానీ, వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో అదనపు లాభాలు అందుకుంటారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ పెట్టడం మంచిది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో లక్ష్యాలు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు తీరిక లేకుండా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఆశించిన శుభవార్త వింటారు. బంధుమిత్రుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయి, ఎంతో ఊరట చెందుతారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఆర్థికపరంగా ఇతరులకు మాట ఇవ్వ డం మంచిది కాదు. మంచి స్నేహాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం మీద పడుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బాగానే గట్టెక్కుతారు. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఈ వారం జీవితంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయానికి సంబంధించి, జీత భత్యాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. చిన్నపాటి ఆదాయ ప్రయత్నం కూడా గరిష్ఠంగా విజయవంతం అవుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తారు. లాభదాయక మైన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. సహచరుల బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో పోటీ పెరిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలకు సానుకూల స్పందన లభించకపోవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *