Horoscope Today: వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఏప్రిల్ 11, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం బాగానే ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. అనుకున్న పనులన్నీ పూర్తయి, ఊరట కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం మంచిది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యల్ని కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రుల సమస్యలు, వివాదాల్లో తలదూర్చవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలకు ఢోకా లేదు. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. దైవ కార్యాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. బహుశా పని ఒత్తిడి బాగా తగ్గవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదనపు ఆదాయం మీద ఎంత దృష్టి పెడితే అంత లాభకరం. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలోనే కాక, కుటుంబపరంగా కూడా పనులు, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభి స్తాయి. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉంటాయి. దగ్గర బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. మీ సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపయోగపడతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. డాక్టర్లకు, లాయర్లకు, టెక్నాలజీ, టెక్నికల్ నిపుణులకు తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. అనారోగ్యం నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి సమస్యేమీ ఉండదు. కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయాలు సాధిస్తాయి. ఆస్తి వివాదం విషయంలో సోదరులతో తేల్చుకునే అవకాశం ఉంది. ఉద్యో గంలో అధికారులతో సామరస్యం బాగా పెరుగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యక్తి గత సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సొంత పనుల మీద దృష్టి పెట్టడం ప్రస్తుతానికి చాలా మంచిది. పెండింగ్ పనులు పూర్తి చేయడం మీద దృష్టి పెట్టాలి. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో కొద్దిగా ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

ధనుస్పు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాల్ని విరమించడం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా నెరవేరుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో అధికారులు, సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. బంధువుల తోడ్పాటుతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పని తీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బును జాగ్రత్తగా రాబట్టుకుంటారు. వ్యాపారంలో కొద్ది మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *