Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (జూన్ 19, 2025): మేష రాశికి చెందిన వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు లభిస్తాయి. బాధ్యతల్ని సకాలంలో, సమర్థవంతంగా నిర్వహించడంలో ముందుంటారు. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులకు సహాయంగా నిలబడతారు. ముఖ్యమైన స్థిరాస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత, కుటుంబ సమస్యలనుంచి బయటపడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యత వల్ల విశ్రాంతి కరువవుతుంది. ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయంతో సమానంగా ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశముంది. అధికారులు మీ సమర్థతను గుర్తిస్తారు. సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు చాలావరకు బిజీగా మారిపోతాయి. ఆదాయం బాగా పెరిగే అవ కాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం పెరగడా నికి చేసే ప్రతి ప్రయత్నమూ ఆశించిన ఫలితాన్నిస్తుంది. పిల్లల నుంచి ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సొంత బాధ్యతలు, లక్ష్యాలను పూర్తి చేయడంతో పాటు, సహోద్యోగులకు సహాయ సహ కారాలందిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. కొన్ని ముఖ్యమైన రుణ ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సాధారణ రాబడి ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆదా యం పెరిగే అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయ త్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా అదనపు ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యల చాలావరకు బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదం నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లల చదువుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. కొందరు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు మారే అవకాశం ఉంది. జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వ్యాపారాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని ఆకస్మిక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ముఖ్యమైన వ్యవహారాలను ఎంతో పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించవచ్చు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష‌్ట 1,2)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కొన్ని వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కొందరు బంధుమిత్రులతో అకారణ విభేదాలు తలెత్తుతాయి. ఇంటా బయటా కొద్దిగా శ్రమాధిక్యత ఉండవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారులు కాస్తంత ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో సమయం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంది. ఇతరులకు ఉపయోగపడే పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుకుంటారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. ఆదాయపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగు పడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *