దిన ఫలాలు (జూలై 11, 2025): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం పొందే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. మీ సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా రాబడి పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ లభిస్తుంది. పరిచయస్థుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగా సానుకూలంగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. అధికారుల ఆదరణకు లోటుండదు. వృత్తి జీవి తం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు కనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో కొన్ని వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సానుకూలంగా, సామరస్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి రాబడి బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపా రాలు, స్వయం ఉపాధి వంటివి బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలుంటాయి. తోబుట్టువులతో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పని భారం, పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు లాభసాటిగా సాగిపోతాయి. ఆశించిన శుభవార్తలు అందుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. జీత భత్యాలు పెరిగే సూచనలున్నాయి. కొద్ది మార్పులతో వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఏ పని తలపెట్టినా, ఏ ప్రయత్నం ప్రారంభించినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. తండ్రి నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారం మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి లోటుండదు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ఆశించిన హోదా లభించే అవకాశం ఉంది. డాక్లర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు, ఇతర వృత్తి నిపుణుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాలకు సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు లాభా లపరంగా ఊపందుకుంటాయి. ఆదాయ మార్గాలు కూడా వృద్ది చెందుతాయి. ఇతరులకు సహా యం అందించగలిగిన స్థితిలో ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారమవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన శుభవార్తలు వింటారు. ఆర్థికపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగం మారకపోవడం మంచిది. వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు వింటారు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో మంచి పదవి లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను, లక్ష్యాలను అందుకుంటారు. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. పిల్లలు చదువుల్లో దూసుకుపోతారు. ముఖ్యమైన పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల విషయాల్లో తల దూర్చవద్దు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక లక్ష్యాల్ని అప్పగించడం జరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు అందుతాయి. ఇంటా బయటా అనుకూలతలకు లోటుండదు. సొంత పనుల మీద శ్రద్ద పెట్టడం అవసరం. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్ప కుండా ఫలించే అవకాశం ఉంది. ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. హోదా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. పని భారం, ఒత్తిడి వంటివి తగ్గుముఖం పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కొద్ది ప్రయత్నంతో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధుమిత్రుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తికి సంబంధించిన వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.