Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వ్యాపారాల్లో వారికి లాభాలు పక్కా.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (జనవరి 25, 2025): మేష రాశి వారికి ఆదాయం కొత్త పుంతలు తొక్కే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం మంచిది.  మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వృత్తి జీవితంలో రాబడి బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఆదాయం కొత్త పుంతలు తొక్కుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆస్తి వివాదం పరి ష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తయి ఊరట కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండా ల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు చాలావరకు నిలకడగానే సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు మారి, కొద్దిగా ఊరట లభిస్తుంది. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలని స్తాయి. ఇష్టమైన బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ ఎక్కువగా నమ్మకపోవడం మంచిది. కొద్దిగా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ తలపెట్టిన పనులన్నిటినీ పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం ఏర్ప డుతుంది. వ్యాపారాలు కొద్ది లాభాలతో పురోగమిస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితంలో కొద్దిగా సమస్యలు తలెత్తుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ సహోద్యోగుల నుంచి ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. రాబడికి లోటుండకపోవచ్చు. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు గడిస్తారు. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తులవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇష్టమైన బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. తల పెట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు సర్దుమణుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తులవారికి డిమాండ్ పెరుగుతుంది. బంధు వుల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితా లనిస్తాయి. ముఖ్యమైన పనులన్నీ అతి తేలికగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ నెరవేరు తుంది. వృథా ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కు వగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. వృత్తి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపో తుంది. వ్యాపారాలలో కొద్ది మార్పులతో ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగు తాయి. ఒకరిద్దరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. మిత్రుల నుంచి రావల సిన డబ్బు వసూలు చేసుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాలు సజావుగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. సర్వత్రా మీ మాట చెలామణీ అవుతుంది. పెళ్లి ప్రయత్నాలలో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలా బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభిస్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి, పని భారం తప్పకపోవచ్చు. అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండ వచ్చు. వృత్తి జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. కుటుంబ జీవితంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వ్యక్తిగత సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు దిగవద్దు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఎదురు చూస్తున్న శుభ వార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. విభేదాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కొద్ది శ్రమతో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపో తాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి. పెండింగ్ పనులను కొద్ది ప్రయ త్నంతో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెలామణీ అవుతుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపా రాలు నిలకడగా సాగిపోతాయి. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక విషయాలమీద శ్రద్దాసక్తులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *