డబ్బుల కోసం కొందరు వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. పౌడర్, కెమికల్స్‌తో తయారు చేసిన కల్లును దుకాణాల్లో విక్రయిస్తున్న ప్రజల శరీరాల్లో విషాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న కల్తీ కల్లు మాఫియాలో మాత్రం ఎటువంటి మార్పు ఉండట్లేదు. దుకాణాల్లో విచ్చలవిడిగా కల్తీ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి కల్తీ కల్లు వ్యవహారం వెలుగు చూసింది. కూకట్పల్లి పీఎస్ పరిధిలోని హైదర్‌నగర్‌లో కల్తీ కల్లు తాగి 11 మంది అస్వస్థతకు గురయ్యారు. కల్లు తాగిన వారు కాసేపటికే వాంతులు, విరేచనాలు, తీవ్ర కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఒక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం
కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైనట్టు సదరు హాస్పిటల్ సిబ్బంది జీహెచ్ఎంసీ, ఎంహెచ్‌వోకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే, అరికెపూడి గాంధీ, బీఆర్ ఎస్ ఎమ్యెల్యే మాధవరం కృష్ణారావు బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కల్తీ కల్లు తయారీ దారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో కూకట్పల్లి పోలీసులు బాధితులను నుంచి వివరాలు సేకరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.