Hyderabad: వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయ్… తెలుసుకోండి

Hyderabad: వార్ 2 ప్రి రిలీజ్ ఈవెంట్.. ఈ మార్గాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నాయ్… తెలుసుకోండి


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీ రోల్‌లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ వార్-2. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ ఆదివారం (ఆగస్టు 11) యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్‌ బ్యాటిల్‌ఫీల్డ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గత ఏడాది పుష్ప-2 ప్రివ్యూ సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు అన్ని చర్యలు చేపడుతున్నారు. అందులో భాగమే ఈ ట్రాఫిక్ డైవర్షన్స్.

ఏయే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి కోట్ల విజయభాస్కర్ స్టేడియం వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను కృష్ణానగర్ జంక్షన్ వద్ద నుంచి శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.

మైత్రివనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాధాపూర్ వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను యూసుఫ్‌గూడ బస్తీ వద్ద నుంచి ఆర్బీఐ క్వార్టర్స్ – కృష్ణానగర్ జంక్షన్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లిస్తారు.

మైత్రివనం నుండి బోరబండ బస్‌స్టాప్ వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను సవేరా ఫంక్షన్ హాల్ – కృష్ణకాంత్ పార్క్ – జీటీఎస్ టెంపుల్ – కల్యాణ్‌నగర్ – మోతినగర్ – బోరబండ బస్‌స్టాప్ వైపు మళ్లిస్తారు.

బోరబండ బస్‌స్టాప్ నుండి మైత్రివనం వైపు వెళ్ళేవారికి: ట్రాఫిక్‌ను ప్రైమ్ గార్డెన్ కల్యాణ్‌నగర్ – మిడ్‌లాండ్ బేకరీ – జీటీఎస్ కాలనీ – కల్యాణ్‌నగర్ జంక్షన్ – ఉమేష్ చంద్ర విగ్రహం యూటర్న్ – ఐసీఐసీఐ యూటర్న్ – మైత్రివనం జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ఇక ఈ మూవీ వేడుకకు వచ్చే వాహనదారుల కోసం జనకమ్మతోట 1 & 2 (మెట్రో పార్కింగ్), యూసుఫ్‌గూడ, సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద ఫోర్-వీలర్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ నెల 14న విడుదల అవ్వనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *