Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..

Hyderabad: హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..


హైదరాబాద్, 06 జనవరి 2025: హిమాయత్ నగర్‌లోని మినర్వా హోటల్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హోటల్ కిచెన్‌లో మొదలైన మంటలు శరవేగంగా హోటల్‌లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ మంటలతో హోటల్‌లోని కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయంతో హోటల్ నుంచి బయటికి పరుగులు తీశారు.

భారీ అగ్నిప్రమాదం కారణంగా మినర్వా హోటల్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు కొన్ని గంటల పాటు శ్రమించారు. నారాయణగూడ పోలీసులు అగ్ని ప్రమాద ఘటనకు కారణాలపై ఆరా తీస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *