Steve Smith Brake Sachin Tendulkar’s Century Record: భారత్‌పై స్టీవ్ స్మిత్ డేంజరస్ బ్యాటింగ్ కొనసాగుతోంది. గబ్బా తర్వాత మెల్‌బోర్న్ టెస్టులోనూ సెంచరీ సాధించి, మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇది అతని కెరీర్‌లో 34వ సెంచరీ కాగా భారత్‌పై 11వ సెంచరీ. ఈ సెంచరీతో స్మిత్ మెల్‌బోర్న్‌లో రికార్డులు సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌పై 55 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు చేసిన జో రూట్ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు. వీరిద్దరి తర్వాత గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్‌లు టీమిండియాపై తలో 8 సెంచరీలు సాధించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో నంబర్ వన్..
అడిలైడ్‌లో అంచనాలను అందుకోలేకపోయిన స్టీవ్ స్మిత్, గబ్బాలో అద్భుతమైన సెంచరీతో తన పాత ఫాంను మరోసారి గుర్తు చేశాడు. ఎంసీజీలో మరో కీలకమైన నాక్‌తో భారత జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఈ క్రమంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును ఈ ఆస్ట్రేలియన్ వెటరన్ బ్యాటర్ బద్దలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లు వీరే..
ప్లేయర్ | ఇన్నింగ్స్ | సెంచరీలు |
---|---|---|
స్టీవ్ స్మిత్ | 41 | 10 |
సచిన్ టెండూల్కర్ | 65 | 9 |
విరాట్ కోహ్లీ | 47 | 9 |
రికీ పాంటింగ్ | 51 | 8 |
మైఖేల్ క్లార్క్ | 40 | 7 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..