IND vs ENG: గిల్‌ సేన ఘనవిజయంపై స్పందించిన దిగ్గజ మాజీ కెప్టెన్లు దాదా, విరాట్‌ కోహ్లీ! ఏమన్నారంటే..?

IND vs ENG: గిల్‌ సేన ఘనవిజయంపై స్పందించిన దిగ్గజ మాజీ కెప్టెన్లు దాదా, విరాట్‌ కోహ్లీ! ఏమన్నారంటే..?


ఇంగ్లాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గిల్‌ సేన విజయం ఢంకా మోగించింది. భారత క్రికెట్‌ చరిత్రలో టీమిండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు విజయం. తొలి టెస్టు ఓటమి నుంచి తేరుకున్న యంగ్‌ టీమిండియా.. రెండో టెస్టులో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి.. ఇంగ్లాండ్‌ను వాళ్ల సొంత గడ్డపై మట్టి కరిపించింది. అయితే.. ఈ చారిత్రాత్మక విజయంపై టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్లు సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. మరి వాళ్లు ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే గొప్పగా నిలిచిన విరాట్‌ కోహ్లీ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. “ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు గొప్ప విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. శుభ్‌మాన్ బ్యాట్‌తో, ఫీల్డ్‌లో అద్భుతంగా నాయకత్వం వహించాడు. అందరూ అద్భుతంగా ఆడారు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేసిన విధానానికి సిరాజ్, ఆకాష్‌లను ప్రత్యేకంగా అభినందించాలి.” అని పేర్కొన్నాడు.

అలాగే టీమిండియా తలరాతను మార్చిన కెప్టెన్‌గా కీర్తి పొందిన సౌరవ్‌ గంగూలీ సైతం ఎక్స్‌లో పోస్టూ చేస్తూ.. “శుభ్‌మన్ గిల్ అండ్‌ టీమ్‌ బ్యాట్‌తో బాల్‌తో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆకాస్‌దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ కంటే ఇండియన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ చాలామెరుగ్గా కనిపిస్తోంది.. అకాస్‌దీప్, సిరాజ్ రేసుగుర్రాలు. బుమ్రా లేకుండా టీమిండియా గెలిచింది. గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు” అని తెలిపాడు. మరింత మంది మాజీ క్రికెటర్లు టీమిండియా సాధించిన ఈ ఘన విజయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *