నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫీల్డింగ్ కు రానుంది. కాగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా కింగ్ కోహ్లీ మ్యాచ్ కు దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లో అరంగేట్రం చేయబోతున్నారు.
ఇరు జట్లు..
ఇవి కూడా చదవండి
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహ్మద్.
అరంగేట్ర ఆటగాళ్లకు క్యాప్ ఇస్తోన్న రోహిత్ శర్మ, మహ్మద్ షమీ..
𝘼 𝙢𝙤𝙢𝙚𝙣𝙩 𝙩𝙤 𝙘𝙝𝙚𝙧𝙞𝙨𝙝 𝙛𝙤𝙧 𝙔𝙖𝙨𝙝𝙖𝙨𝙫𝙞 𝙅𝙖𝙞𝙨𝙬𝙖𝙡 & 𝙃𝙖𝙧𝙨𝙝𝙞𝙩 𝙍𝙖𝙣𝙖! 👏 👏
ODI debuts ✅ ✅ as they receive their ODI caps from captain Rohit Sharma & Mohd. Shami respectively! 👍 👍
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia |… pic.twitter.com/b2cT8rz5bO
— BCCI (@BCCI) February 6, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..