Ind vs Eng : టెస్ట్ సిరీస్‌లో డ్రా అయిన తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మరోసారి ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి రెండు జట్లు టీ20 ఫార్మాట్లో మరోసారి తలపడనున్నాయి. టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన తర్వాత, ఇప్పుడు టీమిండియా జూలై 2026లో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ షెడ్యూల్‌ను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది. ఈ సిరీస్ 2026 టీ20 వరల్డ్ కప్ సన్నాహాలకు చాలా కీలకం కానుంది.
ఈ సిరీస్ జూలై 1, 2026 నుంచి జూలై 11, 2026 వరకు డర్హమ్, మాంచెస్టర్, నాటింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్‌లలో జరగనుంది. ఈ సిరీస్ ద్వారా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును సిద్ధం చేసుకోవాలని చూస్తోంది. అదే విధంగా, భారత జట్టు కూడా యువ ఆటగాళ్లను పరీక్షించడానికి, కొత్త వ్యూహాలను రూపొందించుకోవడానికి ఇది మంచి అవకాశం.
ఈ సిరీస్‌లో టీమిండియాలో పలువురు యువ ఆటగాళ్లకు, టీ20 స్పెషలిస్టులకు చోటు దక్కవచ్చు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా జట్టుకు బ్యాలెన్స్ ఇస్తాడు. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆడే అవకాశం ఉంది. రింకూ సింగ్ ఫినిషర్‌గా రాణించవచ్చు. బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఉండవచ్చు. ఐపీఎల్లో బాగా రాణించిన మరికొందరు యువ ఆటగాళ్లకు కూడా ఈ అంతర్జాతీయ వేదికపై తమను తాము నిరూపించుకోవడానికి అవకాశం లభించవచ్చు.
పురుషుల జట్టు మాత్రమే కాకుండా, భారత మహిళల జట్టు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. భారత మహిళల జట్టు మే 28 నుంచి జూన్ 2, 2026 వరకు ఇంగ్లండ్ మహిళల జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇది భవిష్యత్తులో ఇంగ్లండ్‌తో టీమిండియా సంబంధాలకు మరింత బలం చేకూర్చుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..