మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తమ తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే అంత సులువైన విషయం అయితే కాదు. ఈ మ్యాచ్ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఈ స్థానంలో జట్టు గత రికార్డు అంత బాగా లేదు. 1936 నుండి తొమ్మిది టెస్ట్‌లలో ఐదు డ్రాలు, నాలుగు సార్లు ఓడిపోయారు. మాంచెస్టర్‌లో వాతావరణం తేమగా ఉంటుంది. ఇది ఆటను ప్రభావితం చేస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులు టీమిండియాకు ప్రతికూలంగా, ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉంటాయి.
ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఓడిపోయిన తర్వాత.. టీమిండియా ఆటగాళ్లు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. గెలవాల్సిన మ్యాచ్‌ను కేవలం 22 పరుగుల తేడాతో ఓడిపోవడంతో జట్టులో నిస్పృహ ఆహహించింది. లార్డ్స్ టెస్టు ముగిసిన తర్వాత నాలుగో టెస్టు కోసం భారత జట్టు మాంచెస్టర్ చేరుకుంది. మాంచెస్టర్‌లో నాల్గవ టెస్ట్‌కు ముందు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో వారి ఏకైక ప్రాక్టీస్ సెషన్‌లో ఆటగాళ్ళు పాల్గొన్నారు. అయితే.. టీమిండియా ఆటగాళ్లలో తిరిగి జోష్ నింపేందుకు బెకెన్‌హామ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో హనుమాన్ చాలీసా, ఇంగ్లీష్ పాప్, పంజాబీ పాటలు ప్లే చేస్తూ.. ఆటగాళ్లను ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లో రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా పాటలు వింటూ రిలాక్స్ అయ్యారు. పంత్, బుమ్రా ఇద్దరూ వార్మప్ రొటీన్‌లో భాగంగా జిమ్‌లో కూడా కొంత సమయం గడిపారు. పంత్ వేలికి గాయం అవుతున్నప్పటికీ, మాంచెస్టర్ మ్యాచ్‌కు పూర్తి ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా, సిరాజ్ కూడా పాల్గొనలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వారికి విశ్రాంతి ఇచ్చారు. సిరీస్ ముగింపు దశలో ఉండటంతో తదుపరి టెస్ట్‌లో వీరిలో ఎవరికైనా విశ్రాంతి ఇస్తారో లేదో చూడాలి. కాగా నెట్స్‌లో బంతిని ఆపడానికి ప్రయత్నిస్తూ అర్ష్‌దీప్ బౌలింగ్ చేతికి గాయం అయింది. ఈ సిరీస్‌లో ఇంకా ఆడని ఎడమచేతి వాటం పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి బౌలింగ్ చేస్తుండగా, సాయి సుదర్శన్ కొట్టిన బాల్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతికి గాయమైంది. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ అర్ష్‌దీప్ గాయం గురించి అప్‌డేట్ అందించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి