ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్మాన్ గిల్ ఏకంగా డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 147 పరుగులతో మెరిసిన గిల్, ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో 269 పరుగుల రికార్డ్ బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు గిల్. అయితే వాటిలో ఓ స్పెషల్ రికార్డ్ గురించి మాట్లాడుకోవాలి.
తొలి టెస్ట్‌లో సెంచరీ, రెండో టెస్టులో కూడా మూడెంకల స్కోర్‌తో గిల్ ఒక ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో వరుసగా సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో అతనికి చోటు లభించింది. సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత టీం ఇండియా కెప్టెన్ బ్యాట్‌తో ఈ ఘనత సాధించడం విశేషం.
1990లో ఇంగ్లాండ్‌పై వరుసగా సెంచరీలు చేసి టీమిండియా కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఒక తిరుగులేని రికార్డ్ ఉండేది. లార్డ్స్‌లో అజార్ 121 పరుగులు చేశాడు, ఆ తర్వాత ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 179 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఒక భారత కెప్టెన్ ఇంగ్లాండ్‌లో వరుసగా టెస్ట్ సెంచరీలు సాధించాడు. హెడింగ్లీలో 147 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఆడిన గిల్, ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో 269 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్‌ఫ్యాక్ట్ అజార్ కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. అజార్ తర్వాత ఇంగ్లాండ్‌లో వరుసగా టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్‌గా అతను నిలిచాడు.
శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. గిల్ 269, యశస్వి జైస్వాల్ 87, రవీంద్ర జడేజా 89, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో రాణించారు. ఇక ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్ ఆలౌట్ చేస్తే ఫాలో ఆన్ ఆడించే ఛాన్స్ ఉంది.