IND vs PAK:కోహ్లీ క్రేజ్ అలాంటిది మరి.. విరాట్‌తో ఫొటోలు దిగేందుకు క్యూ కట్టిన పాక్ క్రికెటర్లు.. వీడియో

IND vs PAK:కోహ్లీ క్రేజ్ అలాంటిది మరి.. విరాట్‌తో ఫొటోలు దిగేందుకు క్యూ కట్టిన పాక్ క్రికెటర్లు.. వీడియో


టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా మన శత్రుదేశమైన పాక్ లో కింగ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. అయితే పాక్ క్రికెట్ జట్టులోనూ విరాట్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్షమే ఈ వీడియో.ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ మైదానంలో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఫలితం ఏమిటో అందరికీ తెలుసు కదా? ఎప్పటిలాగే ఐసీసీ టోర్నమెంట్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను ఓడించింది. ఆరు వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీతో ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి పాకిస్తాన్ ఆటగాళ్లు క్యూ కట్టారు. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత, పాకిస్తాన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీతో ఒక్కొక్కరుగా ఫోటోలు దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోతో పాకిస్తాన్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ పట్ల ఉన్న క్రేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. విరాట్ తో ఫోటో దిగాలనే వారి ఆత్రుత స్పష్టంగా కనిపించింది. విరాట్ కోహ్లీ కూడా వారిని నిరాశపరచలేదు. తన దగ్గరకు వచ్చిన అందరితో ఎంతో ఓపికగా ఫోటోలు, సెల్ఫీలు దిగాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ తరఫున సౌద్ షకీల్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత భారత జట్టు మరో 45 బంతులు ఉండగానే 242 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. పాకిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని టీం ఇండియా 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కింగ్ కోహ్లీ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి

కింగ్ కోహ్లీతో పాక్ క్రికెటర్లు.. వీడియో..

ఇస్లామాబాద్ లో కోహ్లీ అభిమానుల హంగామా.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *