ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు(ఫిబ్రవరి 23, ఆదివారం) పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరి కొన్ని గంటల్లోనే ఈ మెగా మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైన విజయం సాధించాలని భారత క్రికెట్ అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. టీమిండియా విజయాన్ని కాంక్షిస్తూ.. వారణాసిలో కొంతమంది అభిమానులు పూజలు, యజ్ఞం కూడా చేశారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండియాలో క్రికెట్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా ఒక మతంలా భావిస్తారని చాలా మంది అంటూ ఉంటారు. ఇండియన్స్‌కు క్రికెట్ అంటే ఓ ఎమోషన్. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను క్రికెట్ ఒక్కటి చేస్తుంది. క్రికెట్‌ను విపరీతంగ ఆదరించే, క్రికెటర్లను ఆరాధించే దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటిది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ ఉత్సాహం, క్రేజ్, ఒత్తిడి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా మ్యాచ్ ఆదివారం కావడంతో అంతా ఉదయం నుంచే మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని పనులు అవగొట్టుకొని.. టీవీలకు అతుక్కుపోవడానికి రెడీగా ఉన్నారు.
కొంతమంది అయితే ఉదయమే వెళ్లి చికెన్, మటన్, స్నాక్స్, కూల్‌డ్రింక్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. మధ్యాహ్నం ఫుల్‌గా తినేసి.. ఇక మ్యాచ్ చూస్తూ కూర్చోవచ్చని ప్లాన్‌లో ఉన్నారు. తమ అభిమాన ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పాకిస్థా్‌న్‌ను ఇరగ్గొడుతుంటే చూడాలని ఉత్సాహంగా ఉన్నారు. పైగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో ఎదురైన ఓటమికి.. కోహ్లీ ఈ మ్యాచ్‌తో ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకే ఎలాగైనా టీమిండియా గెలవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
Fans perform Havan in Varanasi for Team India’s Victory against Pakistan in the Champions Trophy. 🇮🇳 [ANI] pic.twitter.com/UNpEutCeXx
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.