IND vs PAK: మరి కొద్దిసేపట్లో మ్యాచ్‌.. దుబాయ్‌లో వెదర్‌ ఎలా ఉంది? పిచ్‌ రిపోర్ట్‌, భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!

IND vs PAK: మరి కొద్దిసేపట్లో మ్యాచ్‌.. దుబాయ్‌లో వెదర్‌ ఎలా ఉంది? పిచ్‌ రిపోర్ట్‌, భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే!


ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడు 2.30 అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు. ఎందుకంటే.. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ అదే టైమ్‌కి స్టార్ట్‌ అవుతుంది కానుక. సో.. మీరు కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసమే వెయిట్‌ చేస్తున్నారా? మరి కొన్ని గంటల్లో ఆరంభం కానున్న ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో దిగబోతుంది? ప్రస్తుతం దుబాయ్‌ వెదర్‌ ఎలా ఉంది? పిచ్‌ రిపోర్ట్‌ ఏంటి? రోహిత్‌ శర్మ టాస్‌ గెలిస్తే ముందు బ్యాటింగ్‌ తీసుకుంటాడా? ఫీల్డింగ్‌ తీసుకునే అవకాశం ఉందా? బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లానే ఇది కూడా స్లో పిచ్‌పైనే జరుగుతుందా? ఇలా కొన్ని డౌన్స్‌కు క్లియర్‌గా సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా దుబాయ్‌ వెదర్‌ గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం అక్కడ వెదర్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఆదివారం 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. మబ్బులేం లేకుండా.. ఆకాశమంతా చాలా క్లియర్‌గా ఉంది. సో వర్షం వచ్చే అవకాశం లేదు. మ్యాచ్‌కు వర్షంతో వచ్చిన గండమేమి లేదు. అలాగే ఈ రోజు అక్కడ రోజు ఉండేంత వేడి ఉండకపోవచ్చు. కాస్త చల్లగానే ఉంటుండటంతో రాత్రి పూట డ్యూ కూడా రాదని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇది టాస్‌ సమయంలో కీలకంగా మారే అంశం. టాస్‌ గెలిస్తే ముందు ఏం చేయాలనే డ్యూ వస్తుందా? రాదా? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. పగలు ఎక్కువ వేడిగా ఉంటే రాత్రి డ్యూ వస్తుంది. పగలు చల్లగా ఉంటే రాత్రి డ్యూ రాదు. సో దుబాయ్‌లో ఈ రోజు డ్యూ వచ్చే ఛాన్స్‌ తక్కువ. బంగ్లాదేశ్‌తో 20వ తేదీన జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో డ్యూ రాలేదు. సో ఈ రోజు కూడా డ్యూ రాని అవకాశం ఎక్కువగా ఉండటంతో ఒక వేళ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇక పిచ్‌ రిపోర్ట్‌కి వచ్చేస్తే.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఉన్నట్లే ఇప్పుడు కూడా స్లో పిచ్‌ ఉంటుందని సమాచారం. ముందుగా పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. మిడిల్డార్‌ బ్యాటర్లకు ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. చాలా ఓపికతో బ్యాటింగ్ చేస్తేనే పరుగులు వస్తాయి. పవర్‌ ప్లేలో మాత్రం వేగంగా పరుగులు చేయాలి. ఇక టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ విషయానికి వస్తే.. కుల్దీప్‌ యాదవ్‌ను పక్కనపెట్టి వరుణ్‌ చక్రవర్తి ఆడించే అవకాశం ఉంది. అలాగే అర్షదీప్‌ సింగ్‌ కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వస్తాడని కూడా సమాచారం. మొత్తంగా భారత ప్లేయింగ్‌(అంచనా) ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.. రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, మొహమ్మద్‌ షమీ, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా/అర్షదీప్‌ సింగ్‌.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *