Insurance Policy: బీమా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు.. ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్..

Insurance Policy: బీమా కంపెనీలకు కేంద్రం ఆదేశాలు.. ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి బిగ్ రిలీఫ్..


బీమా పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ వ్యవధిని పెంచాలని కోరుతూ ఇన్సూరెన్స్ కంపెనీలకు కేంద్రం ప్రతిపాదనలు పంపింది. దీనిని అమలు చేయగలిగితే పాలసీదారులకు బిగ్ రిలీఫ్ అందనుంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకూ పాలసీదారు ఫ్రీ లుక్ పీరియడ్ ను కంపెనీలు నెల రోజుల పాటు నిర్ణయించాయి. అయితే, దీనిని ఏడాది కాలానికి పొడిగించాలని కేంద్రం ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలను కోరింది. ముంబైలో బడ్జెట్ సమావేశాల తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు ఈ అప్డేట్ ను వెల్లడించారు.

పాలసీని రద్దు చేసుకోవచ్చు..

ఫ్రీ లుక్ పీరియడ్ అంటే పాలసీదారుడు తమ బీమా పాలసీని ఎటువంటి సరెండర్ ఛార్జీలు లేకుండా రద్దు చేసుకోవడానికి కల్పించే సమయం. ఈ వ్యవధిలో పాలసీదారుడు పాలసీని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంటే బీమా సంస్థ మొదట చెల్లించిన ప్రీమియంను వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ప్రీమియంను తిరిగిచ్చేస్తారా..

గతేడాది భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ కాలాన్ని 15 రోజుల నుంచి 30 రోజులకు పొడిగించింది. ఇప్పుడు బీమా కంపెనీలు కస్టమర్లకు మరింత భద్రత కల్పించడానికి దీనిని ఒక ఏడాది పాటు పొడిగించాలని కేంద్రం కోరింది. బీమా పాలసీల లుక్ అవుట్ వ్యవధిని ఒక నెల నుంచి ఒక సంవత్సరానికి పెంచడానికి ప్రభుత్వం బీమా కంపెనీలను ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తోంది అని నాగరాజు అన్నారు. పాలసీదారుడు ఆ వ్యవధిలోపు పాలసీని తిరిగి ఇస్తే, బీమా సంస్థ మొదట చెల్లించిన ప్రీమియంను తిరిగి చెల్లిస్తుందని ఆయన అన్నారు.

తప్పుడు పాలసీలకు కళ్లెం..

బీమా కంపెనీలు కస్టమర్లకు తప్పుడు పాలసీలను కట్టబెట్టడం వంటివి నిరోధించడానికి ప్రభుత్వం ఈ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు బీమా పాలసీలలో కాల్ బ్యాక్ ను ప్రవేశపెట్టాలని కోరింది. అంటే పాలసీను అమ్మిన తర్వాత పాలసీ తీసుకున్న వారు సంతోషంగా ఉన్నారా లేక దానిని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నారా అని తెలుసుకునేందుకు ఇది సాయపడుంది. అని నాగరాజు పేర్కొన్నారు. తప్పుడు పాలసీలు కట్టబెడుతున్నట్టుగా తమకు ప్రజల నుంచి ఫిర్యాదులు అందినట్టు వారు తెలిపారు. ఈ ప్రయత్నం ఫలించి ఇటీవల కాలంలో ఈ ఫిర్యాదుల సంఖ్య భారీగా 26,107 నుండి 23,335కి తగ్గిందన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *