వేసవి సమీపిస్తున్న కొద్దీ, కూలర్లు, ఎయిర్ కండిషనర్ల (ACలు) డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో తేలికపాటి వేడి సమయంలోనూ కూలర్ల గిరాకీ భారీగా పెరిగింది. ఇప్పుడు వచ్చే నెలలో కూడా ఎండ వేడి మరింత పెరగనుంది. ఇలాంటి సమయంలో ఎయిర్ కండిషనర్ తప్పనిసరి అవుతుంది. మీరు కొత్త AC కొనాలని ఆలోచిస్తుంటే కొన్నింటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది ఎదుర్కొనే సాధారణ సందిగ్ధత ఇన్వర్టర్ AC లేదా నాన్-ఇన్వర్టర్ ACని ఎంచుకోవాలా అనేది. ఈ రెండు రకాల ఎయిర్ కండిషనర్ల మధ్య తేడాల గురించి మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇంట్లో ఇన్‌స్టాల్ చేసే సాధారణ ఇన్వర్టర్‌తో ఇన్వర్టర్ ACని నడపవచ్చని చాలా అనుకుంటారు. “ఇన్వర్టర్” అనే పదం యూనిట్లలో ఉపయోగించే ఒక నిర్దిష్ట సాంకేతికతను సూచిస్తుంది. ACని కొనుగోలు చేసేటప్పుడు కూలింగ్, సామర్థ్యం, పవర్ వినియోగం వంటి అంశాలకు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. తప్పుడు రకం ACని ఎంచుకోవడం వల్ల తగినంత కూలింగ్, అధిక విద్యుత్ బిల్లులు వస్తాయి.
మార్కెట్లో రెండు ప్రధాన ఏసీలు:
ఇన్వర్టర్ -నాన్-ఇన్వర్టర్. మీకు ఏ ఎయిర్ కండిషనర్ మరింత అనుకూలంగా ఉంటుందో, ఏది మీకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుందో తెలుసుకోవాలి.
ఇన్వర్టర్ ACలు అంటే ఏమిటి?
ఇన్వర్టర్ ACలు కంప్రెసర్ వేగాన్ని నియంత్రించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి. మీరు ACని ఆన్ చేసినప్పుడు అది గదిని కావలసిన ఉష్ణోగ్రతకు త్వరగా చల్లబరుస్తుంది. ఆ తర్వాత అది కంప్రెసర్‌ను ఆపివేయడానికి బదులుగా వేగాన్ని తగ్గిస్తుంది. ఈ విధానం వల్ల తక్కువ విద్యుత్తును వినియోగిస్తూ స్థిరమైన కూలింగ్‌ను మెయింటెన్ చేస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇన్వర్టర్ ఏసీ ఆన్ ఆఫ్ కాకుండా ఆన్‌లోనే ఉంటూ తక్కువ వేగంతో నడుస్తుంది.
ఇప్పుడు నాన్-ఇన్వర్టర్ ఏసీల సంగతేంటి?
నాన్-ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ పూర్తి స్థాయిలో పవర్‌తో పని చేస్తుంది.ఎలాంటి ఇన్వర్టర్ ఉండదు కాబట్టి విద్యుత్ బిల్లు ఎక్కువగా ఉంటుంది. మీరు మొదట దాన్ని ఆన్ చేసినప్పుడు గది కావలసిన ఉష్ణోగ్రతకు చేరుకునే వరకు కంప్రెసర్ నడుస్తుంది. ఆ సమయంలో అది ఆగిపోతుంది. అయితే, ఉష్ణోగ్రత మళ్ళీ పెరగడం ప్రారంభించినప్పుడు కంప్రెసర్ తిరిగి తన పని మొదలు పెడుతుంది. ఇలా పదే పదే ఆన్, ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది. తత్ఫలితంగా, బిల్లులు పెరుగుతాయి.
కూలింగ్ సామర్థ్యం విషయానికి వస్తే, ఇన్వర్టర్ ACలు పైచేయి సాధిస్తాయి. గది తగినంత చల్లగా ఉన్నప్పటికీ వాటి కంప్రెషర్‌లు పనిచేస్తాయి. తద్వారా చల్లని గాలి స్థిరంగా ప్రవహిస్తుంది. దీనికి విరుద్ధంగా ఇన్వర్టర్ కాని ఏసీలు గదిని త్వరగా చల్లబరుస్తాయి కానీ వాటి స్థిరమైన ఆన్-అండ్-ఆఫ్ సైక్లింగ్ కారణంగా తరచుగా ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు దారితీస్తాయి. అందువల్ల, విద్యుత్ బిల్లులను ఆదా చేయడం, స్థిరమైన ఉష్ణోగ్రతను నిర్వహించడం మీ లక్ష్యం అయితే, ఇన్వర్టర్ ACని ఎంచుకోవడం తెలివైన ఎంపిక.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి