ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో ఓటమిని చూవిచూసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆర్సీబీ.. మూడు మ్యాచ్ గెలిచి, రెండు ఓడింది. ఓడిన రెండు కూడా వాళ్ల సొంత మైదానం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఓడిపోయింది. గెలిచిన మూడు కూడా ప్రత్యర్థి జట్లు సొంత మైదానాల్లో గెలిచింది. అది కూడా కోల్‌కతా, చెన్నై, ముంబై లాంటి పెద్ద టీమ్స్‌ను వాళ్లు హోం గ్రౌండ్‌లో ఓడించింది. అయితే.. గురువారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీకి సూపర్ స్టార్ట్ లభించింది. అలాగే బౌలింగ్‌లో ఆరంభంలోనే అదరగొట్టి 30 పరుగులకే 3 కీలక వికెట్లు పడగొట్టినా.. మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.
ఈ ఓటమి తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా గరం గరం చర్చలు నడిచినట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే.. మ్యాచ్‌లో చేసిన తప్పిదాలపై రచ్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా యువ కెప్టెన్ రజత్ పటీదార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలే ఓటమికి ప్రధాన కారణాలంటూ టీమ్ మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం పటీదార్ తీసుకున్న నిర్ణయాలపై ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెటప్‌పై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో ఎంత మొత్తుకుంటున్నా.. పటీదార్ పట్టించుకోకుండా తన ఒంటెద్దు పోకడ చూపించాడంటూ సపోర్టింగ్ స్టాఫ్ సైతం తన నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడు విజయాలు రావడం, బ్యాటింగ్‌లో కాస్త రన్స్ వస్తుండటంతో పటీదార్‌లో ఓవర్ కాన్పిడెన్స్ కాస్త పెరిగినట్లు టీమ్‌లో గుసగుసలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. అయితే మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్‌లో జరిగిన రివ్యూ మీటింగ్‌లో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కోహ్లీ కోపంగా ఉన్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. మరి వచ్చే మ్యాచ్‌లోనైనా పటీదార్ తన ఆలోచనా విధానం మార్చుకుంటాడో లేదో చూడాలి.
Virat Kohli after yesterday’s loss in the dressing room at Chinnaswamy. 🥺#RohitSharma #ShubmanGill #ViratKohli #KLRahul #IPL2025 #MSDhoni #RCB #CSK #MI #DC #SRH pic.twitter.com/FN5xSYRrDr
— Monish (@Monish09cric) April 11, 2025
Rahat Patidar reaction in dressing room after RCB vs Delhi game pic.twitter.com/x6O3TKt2O5
— Men’s Cricket (@MensCricket) April 11, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..