IPL 2025: ఫ్యాన్స్‌ బుర్రకు కిర్రాక్ పజిల్.. ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్ ఇదేనంట.. కనిపెడతారా భయ్యా?

IPL 2025: ఫ్యాన్స్‌ బుర్రకు కిర్రాక్ పజిల్.. ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్ ఇదేనంట.. కనిపెడతారా భయ్యా?


RCB’s Mystery Retention List: ఐపీఎల్‌లోని మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను విడుదల చేసేందుకు నేటితో గడువు ముగుస్తోంది. అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లలో అట్టిపెట్టుకున్న, RTM ద్వారా ఎంపిక చేసిన ఆటగాళ్ల జాబితాను రేపు అంటే అక్టోబర్ 31న 5 గంటలలోపు BCCIకి సమర్పించాల్సి ఉంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు బేరీజు వేసుకుని జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఛాంపియన్‌గా నిలవని ఆర్‌సీబీ కూడా ఈసారి ట్రోఫీని నిలబెట్టుకునేందుకు పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు సిద్ధమైంది. అయితే, అంతకు ముందు, ఫ్రాంచైజీ తన రిటెన్షన్ లిస్ట్‌లో ఎవరిని నిలుపుకున్నారనే దానిపై నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ జాబితాను ఇవ్వడానికి ఒక రోజు మిగిలి ఉన్నందున, ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో భిన్నమైన పోస్ట్‌ను పంచుకుంది. ఇది అభిమానులను విస్మయానికి గురి చేసింది.

ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్ ఇదేనా?

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఈసారి నలుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచే ఆలోచనలో ఆర్సీబీ ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం, విరాట్ కోహ్లీ మొదటి ఎంపికగా జట్టులో ఉండటం ఖాయం. రెండో ఆప్షన్‌గా మహ్మద్‌ సిరాజ్‌ను జట్టు ఉంచుకోనుంది. రజత్ పటీదార్, విల్ జాక్స్‌లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా యశ్ దయాళ్ అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా జట్టులో కొనసాగగలడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

అభిమానుల బర్రకు పని కల్పించిన RCB ఫ్రాంచైజీ తన సోషల్ మీడియా ఖాతాలో పజిల్ లాంటి పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పజిల్ గేమ్‌లో, జట్టు నిలబెట్టుకోగల ఆటగాళ్ల పేర్లు దాగి ఉన్నాయి. దీన్ని వెతికితే మొత్తం 8 మంది ఆటగాళ్ల పేర్లు కనిపించాయి. కానీ, ఒక ఫ్రాంచైజీ జట్టులో కేవలం ఆరుగరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోగలదు. అందుకే, తను లిస్ట్ చేసిన ఈ 8 మంది ఆటగాళ్లలో RCB ఎవరిని ఉంచబోతోంది అనేది రేపు తేలిపోనుంది.

ప్రస్తుతం RCB షేర్ చేసిన జాబితాలోని ఆటగాళ్లు..

విరాట్ కోహ్లీ

మహ్మద్ సిరాజ్

విల్ జాక్స్

గ్లెన్ మాక్స్‌వెల్

రజత్ పాటిదార్

అనుజ్ రావత్

యశ్ దయాళ్

ఫాఫ్ డు ప్లెసిస్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *