Mayank Yadav Injured Before IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాత, ఇప్పుడు అభిమానులు ఐపీఎల్ (IPL) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా ఎక్కువ రోజులు లేవు. ఒకవైపు ఈ టోర్నమెంట్ పట్ల అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొనగా.. మరోవైపు చాలా మంది ఆటగాళ్లకు గాయాలతో జట్లకు సమస్యలను పెరిగాయి. గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్‌లలో ఆడలేడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ బౌలర్ గాయపడి ఐపీఎల్ మొదటి అర్ధభాగానికి దూరంగా ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి.
పూర్తి ఫిట్‌గా లేని మయాంక్ యాదవ్..
లక్నో సూపర్ జెయింట్స్ యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్ మొదటి అర్ధభాగంలో ఆడలేడు. ESPN Cricinfo ప్రకారం, మయాంక్ యాదవ్ తన గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. గత ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి పునరావాస ప్రక్రియలో ఉన్నాడు. మయాంక్ యాదవ్ ఎప్పుడు పూర్తిగా ఫిట్ అవుతాడో బీసీసీఐ ఇంకా చెప్పలేదు. కానీ, అతను అన్ని పారామితులను దాటినప్పటికీ, ఐపీఎల్ రెండవ సగం నాటికి మాత్రమే తిరిగి రాగలడని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మయాంక్ యాదవ్ తొలగింపు ఎల్‌ఎస్‌జీకి పెద్ద ఎదురుదెబ్బ..
మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2025 తొలి అర్ధభాగం నుంచి తప్పుకోవడం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. దీనికి కారణం, ఐపీఎల్ వేలానికి ముందు ఫ్రాంచైజీ అతన్ని రూ.11 కోట్లకు అంటిపెట్టుకంది. అతని నుంచి జట్టు చాలా అంచనాలు పెట్టుకుంది. కానీ, ఇప్పుడు అతని గాయం జట్టు సమస్యలను మరింత పెంచింది. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మయాంక్ యాదవ్‌ను చాలా మిస్ అవుతోంది. మయాంక్ యాదవ్ తొలిసారి ఐపీఎల్‌లోకి వచ్చినప్పుడు, అతను తన వేగం కారణంగా చాలా వార్తల్లో నిలిచాడు. కానీ, గాయాలు ఇప్పటివరకు అతని కెరీర్‌పై భారీ ప్రభావాన్ని చూపాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..