IPL 2025 Purple Cap Standings After RCB vs GT: బుధవారం బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఆర్ సాయి కిషోర్ ఐపీఎల్ 2025 పర్పుల్ క్యాప్ స్టాండింగ్స్‌లో నాల్గవ స్థానానికి చేరుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టి ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్‌లను అధిగమించాడు. ఆర్సీబీకి చెందిన జోష్ హాజిల్‌వుడ్ గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ వికెట్ తీసి మూడో స్థానానికి చేరుకున్నాడు.
ఆదివారం గౌహతిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ నూర్ అహ్మద్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. నూర్ తన నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన మిచెల్ స్టార్క్‌ను వెనక్కి నెట్టి జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఇవి కూడా చదవండి
కాగా, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, గుజరాత్ టైటాన్స్ (GT) ఐపీఎల్ 2025లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
చిన్నస్వామి స్టేడియంలో గుజారత్ టైటాన్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి చేరుకుంది. జోస్ బట్లర్ 39 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి ఔటయ్యాడు. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లకు తలా ఒక వికెట్ దక్కింది.
ఆర్‌సీబీ తరపున లియామ్ లివింగ్‌స్టోన్ (54 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు. జితేష్ శర్మ 33, టిమ్ డేవిడ్ 32 పరుగులు చేశారు. మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2025లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా..
ప్లేయర్ | జట్టు | మ్యాచ్‌లు | వికెట్లు | ఎకానమీ | సగటు | బెస్ట్ |
నూర్ అహ్మద్ | చెన్నై | 3 | 9 | 6.83 | 9.11 | 18-4 |
మిచెల్ స్టార్క్ | ఢిల్లీ | 2 | 8 | 10.04 | 9.62 | 35/5 |
జోష్ హాజిల్‌వుడ్ | బెంగళూరు | 3 | 6 | 6.00 | 11.00 | 3/21 |
ఆర్. సాయి కిషోర్ | గుజరాత్ | 3 | 6 | 7.41 | 14.83 | 3/30 |
ఖలీల్ అహ్మద్ | చెన్నై | 3 | 6 | 7.91 | 15.83 | 29/3 |
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..