ఔట్ డోర్స్ లో అల్ట్రా గ్లామరస్ కాస్ట్యూమ్స్ లో కనిపించే జాన్వీ కపూర్, నార్త్ లో ఇప్పటిదాకా చేసినవన్నీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలే. నాకు వెస్టర్న్ ఔట్ఫిట్స్ కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి, రియల్ లైఫ్‌లో నాకు నచ్చినట్టే ఉంటాను.
స్క్రీన్ మీద డైరక్టర్ నా కేరక్టర్‌ని ఎలా డిజైన్ చేసుకున్నారో దానికి తగ్గట్టు కనిపిస్తానని అంటుంటారు ఈ బ్యూటీ. నార్త్ లోనే కాదు, సౌత్‌లో కూడా పద్ధతిగా లంగా ఓణీలోనే కనిపించారు జాన్వీ కపూర్. తారక్ పక్కన ఆమె నటించిన దేవర సినిమా సూపర్ సక్సెస్ అయింది.
ఇందులో తంగం అనే కేరక్టర్ చేశారు జాన్వీ. స్క్రీన్ మీద కనిపించింది కాసేపే అయినా జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేవర 2లో ఆమె కేరక్టర్‌ని ఇంకాస్త పెంచాలనే సలహాలు అందుతున్నాయి మేకర్స్ కి.
ప్రస్తుతం రామ్‌చరణ్‌కి జోడీగా బుచ్చిబాబు సానా డైరక్షన్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. కథా పరంగా ఈ సినిమాలోనూ జాన్వీ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లోనే కనిపిస్తారనే మాటలు వైరల్ అవుతున్నాయి. ఒకట్రెండు పాటల్లో మోడ్రన్ డ్రస్సుల్లో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ రెండు సినిమాలే కాదు, సిద్ధార్థ్ తో నటిస్తున్న పరమసుందరి షూటింగ్‌తోనూ సౌత్‌లోనే బిజీగా ఉన్నారు జాన్వీ పాప. పరమసుందరి షూటింగ్ నెల రోజుల పాటు కేరళ పరిసరాల్లోనే జరగనుంది. సో, 2025 మొత్తం సౌత్ ట్రిప్పులతోనే సరిపోతుందేమో జాన్వీ కపూర్‌కి.