Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..

Jeans: రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటున్నారా.? ఏమవుతుందో తెలుసా..


జీన్స్‌ ధరించడం ఇప్పుడొక ఫ్యాషన్‌. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ జీన్స్‌ను ధరిస్తున్నారు. స్టైల్‌కు పెట్టింది పేరుగా ఉండే జీన్స్‌ను డెనిమ్‌ ఫాబ్రిక్‌తో తయారు చేస్తారు. నిజానికి జీన్స్‌ అంత సకర్యంగా ఉండవు. టైట్‌గా ఉంటూ గాలి కూడా ప్రసరించదు. అయినా కూడా స్టైల్‌ కోసం జీన్స్‌ను ధరిస్తుంటారు. అందుకే జీన్స్‌ను ధరించడం వల్ల పలు రకాల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతుంటారు.

మరీ ముఖ్యంగా రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. రాత్రుళ్లు జీన్స్‌ ధరించడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. అందులోనే జీన్స్ క్లాత్‌ చెమటను పీల్చుకోవు. దీంతో చర్మంపై తేమ ఎక్కువగా ఉండి ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది స్కిన్‌ ఎలర్జీకి దారి తీసే అవకాశం ఉంటుంది. శరీరంపై దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా తొడుల మధ్య ఇన్ఫెక్షన్‌ సోకి దురదదకు దారి తీస్తుంది. చర్మం కందిపోతుంది. ఇక రాత్రుళ్లు జీన్స్ ధరించడం వల్ల నిద్రకు కూడా ఆటకంకం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. టైట్‌గా ఉండే జీన్స్‌ను ధరించడం వల్ల శరీరంలో కొన్ని అవయవాలకు రక్త ప్రసరణ కూడా సరిగా జరగదు. పురుషులు రాత్రుళ్లు జీన్స్‌ ధరించి పడుకుంటే వీర్య నాణ్యతపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో వేడే దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇక జీన్స్‌ను ధరించడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్‌ వంటి సమస్యలకు దారి తీస్తుంది. జీన్స్‌ వల్ల నడుంపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నడుం నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా మహిళల్లో జీన్స్‌ వల్ల పొత్తి కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నెలసరి సమయంలో ఇది మరింత ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది.

అందుకే నింద్రించే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మానికి మృదువుగా ఉండే కాటన్‌ ప్యాంట్‌లను ధరించాలి. ఇవి చెటమను త్వరగా పీల్చుకుంటుంది. అలాగే బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా లూజ్‌గా ఉండేవాటిని ధరించాలి. దీంతో శరీర భాగాలకు గాలి ప్రసరణ బాగా జరుగుతుంది. వేసవిలో సిల్క్‌ దుస్తులను ధరించడం ఉత్తమనని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *