Jeedimetla Fire Accident: జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు

Jeedimetla Fire Accident: జీడిమెట్ల ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. అర్ధరాత్రి వరకూ అదుపులోకి రాని మంటలు


జీడిమెట్ల, నవంబర్‌ 27: జీడిమెట్ల దూలపల్లి రోడ్డులోని ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల తాకిడికి పరిశ్రమలోని మూడు ఫోర్లు దగ్ధమయ్యాయి. మంటల ధాటికి భవనం కుప్పకూలింది. అగ్నిప్రమాదం సంభవించగానే పరిశ్రమలోని కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివారల్లోకెళ్తే..జీడిమెట్ల ఫేజ్‌ 5 దూలపల్లి రోడ్డులో సిరాజుద్దీన్‌ అనే వ్యక్తి ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్స్‌ పేరిట ప్లాస్టిక్‌ బ్యాగులు తయారు చేసే పరిశ్రమను ఏర్పాట్లు చేశాడు. పరిశ్రమల మొత్తం 3 ఫోర్లలో నడుస్తుంది. ఆపైన పెద్ద రేకుల షెడ్డు నిర్మించారు. పరిశ్రమలో మొత్తం 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మంగళవారం జనరల్‌ షిఫ్ట్‌లో 200 మంది అందులో ఉన్నారు. నిన్న మధ్యాహ్నం మూడో అంతస్తులోని రేకుల షెడ్డులో రీప్రాసెసింగ్‌ మెషీన్‌ వద్ద పనులు చేస్తున్నారు. ఇంతలో 12.30 గంటల ప్రాంతంలో రేకుల షెడ్డులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో కార్మికులు భయంతో కిందకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న జీడిమెట్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే భవనంలో పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ నిల్వలు ఉండటంతో మంటలు వెనువెంటనే అంటుకోవడంతో భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ అధికారి శేఖర్‌రెడ్డి ఉన్నతాధికారులకు వివరించడంతో 8 వాహనాలు పరిశ్రమ వద్దకు చేరుకున్నాయి. 5 ఫైర్‌ స్టేషన్‌ల నుంచి వచ్చిన 50 మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు.

మూడో అంతస్తులోకి నీటిని చిమ్మడం కష్టంగా మారడంతో బ్రాంటో స్కైలిఫ్ట్‌ను తెప్పించారు. ఎంత ప్రయత్నించినా మంటలు అర్ధరాత్రి వరకు కూడా అదుపులోకి రాలేదు. లోపల పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ బ్యాగులు నిల్వ ఉండటంతో మంటలు ఒక్కో అంతస్తు నుంచి నేరుగా కింది అంతస్తు వరకు వ్యాపించాయి. మంటల తాకిడికి రెండో అంతస్తు గోడలు కూలిపోయాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. భారీగా చెలరేగిన మంటలతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్మేసింది. ఒక దశలో మంటలు వంద మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. దాంతో పాటు 200 మీటర్ల వరకు వేడిసెగలు వచ్చాయి. రసాయన డ్రమ్ముల పేలుడుతో మంటలు మరింత విజృంభించాయి. ప్రమాదంలో దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. తీవ్రంగా శ్రమించి అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి సమయానికి మంటలను అదుపు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *