కుబేర.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లవ్ స్టోరీ వంటి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన మరో అద్భుతమైన కథాంశం ఈ సినిమా. కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు మెయిన్ హైలెట్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. సాంగ్స్ తోపాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హృదయాలను హత్తుకుంటుంది. అలాగే బిచ్చగాడి పాత్రలో ధనుష్ నట విశ్వరూపం.. మంచి చెడుల మధ్య సతమతమయ్యే సీబీఐ ఆఫీసర్ పాత్రలో నాగార్జున అద్భుతమైన నటన ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ధనుష్, నాగార్జున లాంటి స్టార్స్ తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. కానీ ఈ సినిమాలో మరో హైలెట్ రోల్ విలన్. ఇందులో తనదైన విలనిజంతో ఆకట్టుకున్నాడు జిమ్ షర్బ్.
కుబేర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హైలెట్ అ్యయాడు జిమ్ షర్బ్. ఈసినిమాలో తనదైన విలనిజంతో అదరగొట్టేశాడని చెప్పొచ్చు. ఇంతకీ అతడు ఎవరు..? బ్యాగ్రౌండ్ ఏంటీ ? అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. జిమ్ షర్బ్ సీనియర్ నటుడు కాదు.. ముంబైకు చెందిన అతడి వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు మాత్రమే. తండ్రి ఉద్యోగం కారణంగా చిన్నప్పుడే విదేశాలు తిరిగిన జిమ్.. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ సైకాలజీ చేశారు. 2014లో హిందీలో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఘరురత్ సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2016లో వచ్చిన నీర్జా సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేశారు. ఈ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత హిందీలో పద్మావత్, సంజు సినిమాల్లో విలన్ పాత్రలలో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చింది. కుబేర సినిమాలో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో బిలియనీర్ పాత్రలో కనిపించిన అతడు..చివరకు బిచ్చగాడిగా కనిపించడం మరింత ఆసక్తిగా మారింది. దీంతో ఇప్పుడు కుబేర తర్వాత తెలుగులో అతడికి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..