శ్రీ ఆదిశంకరాచార్యులు అందించిన ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి అంకితమైన పవిత్ర స్వర్గధామం శ్రీ ఆదిశంకర మఠం. ఆదిశంకరాచార్యులు మానవాళికి అందించిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సంరక్షిస్తూ వేద సంప్రదాయాన్ని ముందు తరాలకు వివిధ మార్గాల ద్వారా అందిస్తోంది ఆదిశంకర మఠం. తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో కౌకూరు గ్రామం బొలారంలో ఉన్న కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి.
శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం కీలక ప్రకటన విడుదలచేసింది. శ్రీ శంకరాచార్య జయంతి సందర్భంగా.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సభ్యునిగా చేరేందుకు.. దైవిక వారసత్వంలో భాగం అయ్యేందుకు వీలుగా భక్తులకు ప్రత్యేక ప్రయోజనాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆది శంకరాచార్య మహాసంస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.
జీవితాకాలం సభ్యత్వం రూ.5000లుగా నిర్ణయించగా, ఏడాది సభ్వత్వం రూ.1000 గా నిర్ణయించింది. ఈ సభ్యత్వం తీసుకుంటే.. భక్తులకు శాశ్వత పూజతో పాటు.. ప్రత్యేక పూజలు, ఉచిత సేవలు, ప్రత్యేక దర్శనాలు.. సేవాదళ్ కమిటీ సభ్యులుగా అవకాశం, టికెట్లపై ప్రత్యేక దర్శనం తోపాటు.. పలు రకాలను సేవలను అందించనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సికింద్రాబాద్ బోలారం వెంకుసా ఎస్టేట్స్ కౌకూరు గ్రామంంలోని శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం ప్రకటన విడుదల చేసింది.
శ్రీ శంకర జయంతి వేడుకల్లో భాగంగా 23/03/2025 నుంచి 03/05/2025 మధ్య సభ్యులుగా చేరినవారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య మహాసంస్థానం పేర్కొంది. తెలంగాణలోని కాలడి శ్రీ ఆది శంకర మఠం.. మూలాలను అనుసంధానించే ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారింది.. ఈ దైవిక వారసత్వంలో భాగం అవ్వడానికి అలాగే ప్రత్యేక ప్రయోజనాలను పొందడానికి.. సభ్యత్వం కోసం.. ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయండి..
సభ్యత్వం పొందేందుకు ఈ లింకును క్లిక్ చేయండి..
ఏదైనా సహాయం కోసం ఈ నెంబర్ 8350903080ను సంప్రదించండి..