‘కాంతార’ సినిమాలో కన్నడ బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుందీ అందాల తార. ఇప్పుడు తెలుగుతో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది సప్తమి గౌడ. ఇదిలా ఉంటే కాంతార సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘కాంతార: చాప్టర్ 1’ లో హీరోయిన్ ఎవరో ఇప్పటివరకు వెల్లడించలేదు మేకర్స్. ఇప్పుడు ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చింది. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని కాంతార 2 నుంచి కనకవతి పాత్ర పోస్టర్ విడుదలైంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోన్న రుక్మిణి వసంత్ ఈ పాత్రను పోషిస్తోంది. ‘కాంతార: చాప్టర్ 1′ విడుదలకు కొన్ని నెలలే మిగిలి ఉంది. అందుకే, ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి చిత్ర బృందం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా, ఈ సినిమా హీరోయిన్‌ను పరిచయం చేశారు. సప్త సాగరాలు దాటి సినిమాతో ఆడియెన్స్ మనసులు దోచేసిన రుక్మిణీ వసంత్ ఈ సినిమాలో భాగం కావడంతో కాంతార 2పై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ యువరాణిలా కనిపిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఏంటన్నది సస్పెన్స్ గా ఉంది. కొత్తగా రిలీజైన పోస్టర్ వెనుక భాగాన్ని చూస్తే, అది రాజ సభలా కనిపిస్తుంది. అలాగే, ఇది కదంబ కాలం నాటి కథ కాబట్టి, రుక్మిణి రాణి పాత్ర పోషిస్తుందా లేదా యువరాణి పాత్ర పోషిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
కాంతార: చాప్టర్ 1’ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. రుక్మిణి వసంత్ కు పాన్-ఇండియా స్థాయిలో డిమాండ్ ఉంది. ఆమె ఇప్పటికే చాలా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా, బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. హోంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి
కాంతార 2 సినిమాలో రుక్మిణీ వసంత్..
Introducing @rukminitweets as ‘KANAKAVATHI’ from the world of #KantaraChapter1.
ಕನಕವತಿಯ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ.
कनकवती का परिचय आपके लिए.
కనకవతి ని మీకు పరిచయం చేస్తున్నాం.
கனகாவதியை பற்றிய அறிமுகம் உங்கள் முன் உள்ளது.
കനകാവതിയുടെ ആമുഖം നിങ്ങൾക്കുമുമ്പിൽ.
আপনাদের সামনে কনকবতীকে… pic.twitter.com/4JmMy901un— Hombale Films (@hombalefilms) August 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.