వెర్సటైల్ సినిమాలకు, వైవిధ్యమైన కంటెంట్‌కి కేరాఫ్‌గా మారారు కీర్తి సురేష్. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ టైమ్‌లోనే మహానటిగా పేరు తెచ్చుకున్నారు.
ముద్దుగా, బొద్దుగా పక్కింటమ్మాయిలా కనిపించిన కీర్తి.. ట్రాన్స్ ఫర్మేషన్ తర్వాత కాసింత హాట్‌గా కనిపిస్తున్నారనే కాంప్లిమెంట్స్ అందుకున్నారు. పెళ్లయిన మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు, తానూ తన ఉద్యోగాన్ని చేస్తున్నానని అంటున్నారు కీర్తీ సురేష్.

సినిమా సక్సెస్ అయితే వెంటనే రెమ్యునరేషన్ పెంచడం తన కప్ ఆఫ్ టీ కాదని తెలిపారు. చేస్తున్న పని నచ్చాలి. అందులో కథ నచ్చాలి. కేరక్టర్‌కి కనెక్ట్ కావాలి. అప్పుడే సినిమాకు సంతకం చేస్తానని తెలిపారు.
ఛాలెంజింగ్ రోల్స్ కిక్ ఇస్తాయని, జస్ట్ రెమ్యునరేషన్ పెంచినంత మాత్రాన ఆ హ్యాపీనెస్‌ని క్రియేట్ చేయలేమని అంటున్నారు కీర్తి. తాను ఓపెన్‌గా ఉండటం వల్లనే అన్ని రకాల రోల్స్ తనను పలకరిస్తున్నాయని తెలిపారు. హ్యాపీగా పనిచేస్తున్నప్పుడు లైఫ్ మరింత పాజిటివ్‌గా ఉంటుందన్నది మహానటి నమ్ముతున్న మాట.