శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కిడ్నీలు కూడా ఒకటి. శరీరంలో ముఖ్యమైన పనులను నిర్వర్తించడంలో మూత్ర పిండాలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా పని చేయాలంటే కిడ్నీల సహాయం కూడా కావాలి. కేవలం శరీర ఆరోగ్యమే కాకుండా కిడ్నీల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం.
శరీరంలోని మలినాలు, వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను బయటకు పంపించడంలో కిడ్నీలు ఎంతో చక్కగా పని చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మరి కిడ్నీలను ఎలా క్లీన్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలు ఇప్పుడు చూద్దాం.
మూత్ర పిండాలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిడ్నీలను సరిగా క్లీన్ చేసుకోక పోవడం వల్లనే ఎక్కువగా మూత్ర పిండాల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీలను క్లీన్ చేసుకోవాలి.
మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా.. కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నా.. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి రోజూ కనీసం 4 లీటర్ల నీటిని తీసుకుంటూ ఉండాలి. ఉదయం 11 గంటల వరకు నీటిని తప్ప ఎలాంటి ఆహారం తీసుకోకూడదు.
కేవలం నీళ్లతోనే ఉండాలి. దీన్నే వాటర్ ఫాస్టింగ్ అంటారు. శక్తి లేని వాళ్లు కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కిడ్నీ శుభ్రంగా క్లీన్ అవుతాయి. ఎలాంటి విష పదార్థాలు, మలినాలు ఉన్నా బయటకు పోతాయి. ఇలా చేయాలి అనుకున్నప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలి.
(NOTE: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)