ఇంటి క్లీనింగ్ అనేది చాలా పెద్ద విషయం. సాధారణంగా ఇంటి క్లీనింగ్ అంటే ఆడవారే చేస్తారు. మగవారు ఏ మాత్రం సహాయం చేయరు. చాలా వరకు దుమ్ము కనిపించినంత వరకూ ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. కానీ దుమ్ము, ధూళి కనిపించని ప్రదేశాలు చాలా ఉంటాయి.
ఇలా దుమ్ము, ధూళి కనిపించని వాటిల్లో సోఫాలు కూడా ఒకటి. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు సోఫాలను పై పై నుంచి దులుపుతూ ఉంటారు. కానీ వీటిపై మురికి లోపల వరకు చేరి ఉంటుంది.
ఈ దుమ్ము, దూళి.. బ్యాక్టీరియాలుగా మారి.. అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటిని కూడా డీప్‌గా క్లీన్ చేయాలి. అప్పుడే మురికి వంటివి పోతాయి. ముందుగా సోఫాలను శుభ్రంగా దులిపేయాలి.
ఆ తర్వాత ఓ బౌల్లో కొద్దిగా వంట సోడా, కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ తీసుకుండి. వీటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఓ క్లాత్‌ని వంట సోడా మిశ్రమంలో ముంచి.. సోఫాలను గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మురికి అంతా బయటకు వచ్చేస్తుంది.
అదే విధంగా బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసిన నీటిలో కుషన్స్ ముంచి.. శుభ్రం చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ కంటే చేతితో ఉతకడం చాలా బెటర్. ఆ తర్వాత ఎండ తగిలే ప్రదేశంలో పెడితే త్వరగా ఆరిపోతాయి.