KKR Coach Chandrakant Pandit: కోల్‌కతా నైట్ రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిట్ IPL 2026 కి ముందే జట్టును విడిచిపెట్టాడు. 2023 లో బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో పండిట్ వచ్చాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మెంటర్ గౌతమ్ గంభీర్‌లతో కలిసి 2024 లో KKR ను IPL టైటిల్‌కు నడిపించాడు. కానీ, శ్రేయాస్ అయ్యర్ 2025 లో పంజాబ్ కింగ్స్‌కు మారిన తర్వాత, KKR అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది. అయినప్పటికీ, ఆ జట్టు గత సంవత్సరం విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది. ఐదు విజయాలు, ఏడు ఓటములతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
IPL 2025 లో KKR ఘోర పరాజయం..
వెంకటేష్ అయ్యర్‌ను రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేయడంలో పండిట్ కీలక పాత్ర పోషించాడు. ఎందుకంటే, అతను గతంలో మధ్యప్రదేశ్‌లో అతనికి కోచ్‌గా పనిచేశాడు. కానీ ఆ సీజన్‌లో వెంకటేష్ బాగా రాణించలేకపోయాడు. పండిట్ నాయకత్వంలో, KKR మూడు సీజన్లలో 42 మ్యాచ్‌లలో 22 గెలిచింది. 18 ఓడిపోయింది. 2 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
ఈ మేరకు సోషల్ మీడియాలో పండిట్ నిష్క్రమణను కేకేఆర్ ధృవీకరించింది. కొత్త అవకాశాల కోసం వెతకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. “చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాలను అన్వేషించడానికి KKR ప్రధాన కోచ్‌గా పనిచేయకూడదని నిర్ణయించుకున్నాడు. 2024 లో IPL టైటిల్ గెలుచుకోవడం, బలమైన జట్టును నిర్మించడం వంటి అతని సహకారానికి మేం కృతజ్ఞులం. అతని నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై లోతైన ప్రభావాన్ని చూపాయి. అతని భవిష్యత్తుకు మేం అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి
చంద్రకాంత్ పండిట్ స్థానంలో ఎవరు వస్తారు?
పండిట్ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై కేకేఆర్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కానీ నివేదికల ప్రకారం, ఇంగ్లాండ్, కేకేఆర్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 2026 ఐపీఎల్‌కు ముందే కోచ్ కావొచ్చు. దీనితో పాటు, కేకేఆర్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు కూడా వీడ్కోలు పలికింది. అతని స్థానంలో, జట్టుకు మెంటర్‌గా ఉన్న డ్వేన్ బ్రావో బౌలింగ్ కోచ్ పాత్రను పోషించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..