ఐపీఎల్-18 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. బెంగళూరు జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన తర్వాత ఆర్‌సీబీ కేకేఆర్‌ను 3 సంవత్సరాల తర్వాత ఓడించింది.
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 175 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ కోహ్లీ 59 పరుగులు చేసి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 34 పరుగులు, ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేశారు. కోల్‌కతా నుంచి వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానె (56 పరుగులు) అర్ధశతకం సాధించాడు. సునీల్ నరైన్ 44 పరుగులు, అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగులు అందించారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్ 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, రసిక్ సలాం, సుయాష్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇరుజట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రజత్ పాటిదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ దార్ సలాం, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాళ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే(c), రింకు సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..