Kovvur: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

Kovvur: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్


తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది. గోదావరి ఒడ్డున ఉన్న గట్టుపై ఉన్న సుబ్రహ్మణ్య స్నానాల ఘాట్లో శివాలయం పై అంతస్తులో ఓ కళ్యాణమండపం, వేదిక ఉన్నాయి. బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా గోడ ప్రక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు. తీరా చూస్తే సుమారు 7 అడుగులు ఉన్న ఓ కొండచిలువ అటూ.. ఇటూ.. తిరుగుతోంది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న అందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన వచ్చారు.

ఓ పక్క పెళ్లి భాజాలు,అందరూ గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటూ కదలకుండా ఉండిపోయింది. ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు. దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు, స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆ కొండచిలువను తీసుకెళ్లారు.

ఇది చదవండి: పంట కోతకొచ్చిందని కోసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూడగా

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *