Krunal Pandya IPL Auction 2025: హార్దిక్ పాండ్యా సోదరుడికి షాక్‌.. తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా

Krunal Pandya IPL Auction 2025: హార్దిక్ పాండ్యా సోదరుడికి షాక్‌.. తక్కువ ధరతో కొత్త టీమ్‌లోకి కృనాల్ పాండ్యా


IPL మెగా వేలం రెండవ రోజు భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను మొదటగా కొనుగోలు చేసింది. కృనాల్ పాండ్యాను కొనుగోలు చేసేందుకు బెంగళూరుతో పాటు రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.5.75 కోట్లకు కృనాల్ ను దక్కించుకుంది. 2016లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు కృనాల్ పాండ్యా. ఆర్‌సీబీలో చేరడానికి ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌ జెయింట్స్ జట్ల తరఫున ఆడాడు. 2021లో ముంబై ఇండియన్స్ జట్టు నుంచి బయటకు వచ్చిన కృనాల్‌ను లక్నో ఫ్రాంచైజీ రూ.8.25 కోట్లు చెల్లించి జట్టులోకి చేర్చుకుంది.​ అయితే కృనాల్ మాత్రం జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పేలవ ప్రదర్శన చూపాడు. ఫలితంగా లక్నో సూపర్‌జెయింట్స్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు.

ఐపీఎల్‌లో 127 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ 132.82 స్ట్రైక్ రేట్, 22.56 సగటుతో 1,647 పరుగులు చేశాడు. ఈ ఆల్ రౌండర్ మంచి స్పిన్ బౌలర్ కూడా. కృనాల్ ఇప్పటివరకు ఆడిన 127 మ్యాచ్‌లలో 34.28 సగటుతో 76 వికెట్లు తీశాడు. ఎకానమీ రేటు 7.36.

ఇవి కూడా చదవండి

8. 25 కోట్ల నుంచి 5 కోట్లకు..

కాగా ఈ మెగా ఆక్షన్‌లో టీ20 స్పెషలిస్టులను టార్గెట్ చేస్తోంది ఆర్సీబీ. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ జితేష్ శర్మతో పాటు లియామ్ లివింగ్‌స్టొన్, ఫిల్ సాల్ట్, పేస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్‌ను కొనుగోలు చేసింది ఇంగ్లాండ్‌కు చెందిన లియామ్ లివింగ్‌స్టొన్- రూ.8.75 కోట్లు, ఫిల్ సాల్ట్- 11.50 కోట్లు, టీమిండియా ప్లేయర్ జితేష్ శర్మ- 11 కోట్లు, ఆస్ట్రేలియాకు చెందిన హేజిల్‌వుడ్ కోసం ఏకంగా 12.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.

ముంబై  ఇండియన్స్ టు ఆర్సీబీ వయా లక్నో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *