తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలకు భారీ డిమాండ్ ఉండేది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లోని మద్యం దుకాణాల కోసం ఎంతైనా వెచ్చించేవారు. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు మద్యం ప్రియులు నాణ్యమైన మద్యం కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అక్కడ బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో తెలంగాణ వైపు వచ్చేవారు. దీంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు మండలాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు ఎక్కువగా జరిగేవి. మందుబాబుల రద్దీని తట్టుకునేందుకు రేషన్ కార్డు నిబంధనతోపాటు ఆదివారం సెలవు దినాల్లో అయితే పోలీస్ పహారా మధ్య మద్యం విక్రయాలు జరిగేవి. గతంలో రాష్ట్రంలో ఎక్కువ మద్యం విక్రయాలు జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగేవి. అంతకంటే ఎక్కువగా సరిహద్దు దుకాణాల్లో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగేవి. కానీ కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీంతో ఏపీలో అన్ని రకాల మద్యం బ్రాండ్లను మందుబాబులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఏపీ మందు బాబులు తెలంగాణ మద్యం షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదు.
తెలంగాణ సరిహద్దుల్లోని మద్యం దుకాణాలన్నీ వెలవెలబోతున్నాయి. ఫలితంగా సరిహద్దుల్లోని ఆరు జిల్లాల మద్యం షాపుల్లో విక్రయాలు పడిపోయాయి. సరిహద్దుల్లోని మద్యం షాపులు ఇప్పుడు మందుబాబుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా దుకాణాల్లో విక్రయాలు పెంచుకునేందుకు ఎక్పైజ్‌శాఖ చెమటోడ్చాల్సి వస్తోంది. మూడు ఉమ్మడి సరిహద్దు జిల్లాల్లోని మద్యం దుకాణాల్లో మందుబాబులు రాకపోవడంతో డిసెంబర్ నెలలో40 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ఎక్సెజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. దసరా, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే ఆబ్కారీ శాఖకు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈసారి సరిహద్దుల్లో కొత్త సంవత్సర ఆదాయం కూడా గణనీయంగా తగ్గే ఛాన్సుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి సరిహద్దు జిల్లాల్లో 300 కోట్ల రూపాయల ఆదాయం తగ్గే అవకాశాలున్నాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.