ఈ నెల(జులై) 29, 30, 31 తేదీల్లో మూడు మహా యోగాలు ఒకేసారి చోటు చేసుకుంటున్నాయి. ఆ మూడు రోజుల్లో గజకేసరి యోగం, బుధాదిత్య యోగంతో పాటు చంద్ర మంగళ యోగమనే భాగ్య యోగం కూడా సంభవిస్తున్నందువల్ల కొన్ని రాశులవారు నక్క తోకను తొక్కినట్టవుతుంది. ఆ మూడు రోజుల్లో యోగాలు పట్టడంతో పాటు అప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు ఉత్తరోత్రా తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభం, మిథునం, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీన రాశుల పంట పండబోతోంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.
- వృషభం: ఈ రాశుల వారు ఈ మూడు యోగాల వల్ల అనేక విధాలుగా అదృష్టవంతులు కాబోతున్నారు. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దీర్ఘకాల అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో పదవీ యోగం పడుతుంది. విదేశాల్లో ఆశించిన ఉద్యోగం లభించడంతో పాటు స్థిరత్వం కూడా లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూల సమయం.
- మిథునం: ఈ మూడు మహా యోగాల వల్ల ఈ రాశివారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు. సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అత్యంత ప్రముఖులతో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి.
- వృశ్చికం: ఈ రాశికి ఈ మూడు మహా యోగాల వల్ల అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ముఖ్యంగా భూ లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, అదనపు రాబడి అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. విదేశీ సంపాదన అనుభవించే సూచనలున్నాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- ధనుస్సు: రాశ్యధిపతి గురువుతో సంబంధం కలిగిన గజకేసరి యోగంతో పాటు, బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలు కూడా ఏర్పడడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు, ఆఫర్లు అందుతాయి. అధికార యోగం పడుతుంది.
- మకరం: ఈ రాశికి బుధాదిత్య, చంద్ర మంగళ యోగాలు అత్యంత శుభకరంగా మారుతున్నందు వల్ల రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఈ రంగాల్లో రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
- మీనం: ఈ రాశికి చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం, బుధాదిత్య యోగాల వల్ల జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సగటు వ్యక్తి కూడా కొద్ది ప్రయత్నంతో సంపన్నుడుగా మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అరుదైన అవకాశాలు లభిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.