ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది మలైకా అరోరా. అయిదు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల పడుచు అమ్మాయిగా కనిపిస్తూ కుర్రకారును ఆగం చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
యంగ్ హీరో అర్జున్ కపూర్ తో కొన్నాళ్లుపాటు రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగినట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు ఈ రూమర్స్ పై వీరిద్దరు స్పందించలేదు.
మహారాష్ట్రలోని థానేలో జన్మించిన ఈ వయ్యారి చెంబూర్ లోని స్వామి వివేకానంద స్కూల్లో సెకండరీ విద్యను పూర్తి చేసింది. చర్చిగేట్ లోని జై హింద్ కాలేజీలో కాలేజ్ విద్యను కంప్లీట్ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారి మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 1997లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏడాది వచ్చిన దిల్ సే సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.
దిల్ సే సినిమా చయ్యా చయ్యా పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాల్లో కనిపించింది.