మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మాళవిక మోహనన్ తోపాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తెలుగుతోపాటు హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తుంది మాళవిక. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది మాళవిక. తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. ఈ క్రమంలో ఓ అభిమాని పెళ్లి గురించి అడగ్గా ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటారా ? అని ఓ నెటిజన్ అడగ్గా.. తనకు దెయ్యాలంటే భయమని మాళవిక రిప్లై ఇచ్చారు. అతడి ఎక్స్ ఖాతా పేరు ఘోస్ట్ అని ఉండడంతో ఆమె అలా ఆన్సర్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మాళవిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
అలాగే రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ తో ఓ మాస్ సాంగ్ ఆశించవచ్చా అని అడగ్గా.. తప్పకుండా అంటూ ఆన్సర్ ఇచ్చింది. అలాగే ది రాజాసాబ్ ప్రమోషన్లలో తాను సైతం పాల్గొంటానని తెలిపింది. మోహన్ లాల్ సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ది రాజాసాబ్ సినిమాతోపాటు సర్దార్ 2, హృదయపూర్వం చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపింది. అలాగే తనకు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పనిచేయాలని ఉందంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..