Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే

Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే


Mehaboob Dil Se: ‘మా జీవితంలో కొత్త ఆధ్యాయం మొదలైంది’.. గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్‌ దిల్‌సే

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ రియాలిటీ షోలో రెండు సార్లు పాల్గొన్న అతను విజేతగా మాత్రం నిలవలేకపోయాడు. కానీ తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ సాంగ్స్‌తో తన అభిమానులందరినీ అలరిస్తున్నాడు మెహ బూబ్. ఇటీవల శ్రీ సత్య తో కలిసి అతను చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ తాజాగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. తన తమ్ముడికి కొడుకు పుట్టినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అలాగే బుడ్డోడిని చేతుల్లో తీసుకుని లాలిస్తోన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు.

‘నా సోదరుడు సుభాన్‌కు మగబిడ్డ పుట్టాడు. ఈ బుడ్డోడు ఇప్పటికే మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని కన్నీళ్లుగా మార్చాడు. తనే మా జీవితాల్లో అత్యంత విలువైన బహుమతిగా అనుకుంటున్నాం. అతని రాకతో మా జీవితాలు ప్రేమ మయంగా, నవ్వుల హరివిల్లుగా మారిపోయాయి. అతని ప్రయాణం ప్రేమ, ఆరోగ్యం అంతులేని ఆనందంతో నిండి ఉంటుంది. అతను తన తండ్రిలాగే బలం, దయగల వ్యక్తిగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బుడ్డోడితో మా కుటుంబ సభ్యుల బంధం మరింత దృఢంగా పెరగాలి. మా హృదయాలు ఆనందంతో నిండుగా ఉన్నాయి. ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాను. ఎప్పటికీ కృతజ్ఞతలు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మెహబూబ్.

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

 

ప్రస్తుతం మెహబూబ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు.

మెహబూబ్, దిల్ సే  ల నువ్వే కావాలి సాంగ్ కు మిలియన్ల వ్యూస్..

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *