పుష్ప సినిమాలో ఎన్ని పాటలొచ్చినా.. సూసేకీ స్పెషల్ ప్లేస్లోనే ఉంటుంది. జస్ట్ అలా రిలీజ్ అయిందో లేదో ఇలా జనాల్లోకి దూసుకుపోయిన సాంగ్ అది. బన్నీ సాంగ్ ఎంత రీచ్ అయిందో, అంతకన్నా రవ్వంత స్పీడ్‌గానే దూసుకుపోతోంది చెర్రీ నానా హైరానా పాట.
వండర్ఫుల్ విజువల్స్, ఆకట్టుకుంటున్న లిరిక్స్ నానా హైరానా సాంగ్‌కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. చెర్రీ, కియారా నానా హైరానా విన్న వారందరూ.. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతూ సాంగ్ వైరల్ చేస్తున్నారు.
దేవరలో చుట్టమల్లే పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది. తారక్, జాన్వీ మధ్య సూపర్‌డూపర్ కెమిస్ట్రీని ఆ సాంగ్‌లో కొరటాల వర్కవుట్ చేశారని మాట్లాడుకుంటున్నారు. ఈ పాటకి భారీ వస్తున్నాయి.
సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో ఉంటే, తప్పకుండా ఓ మెలోడీ ఉండాల్సిందే. ఆ విషయాన్ని డార్లింగ్ డైరక్టర్లు కూడా ఫాలో అవుతున్నారు. రాధేశ్యామ్ లాంటి లవ్‌స్టోరీలో మెలోడీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆదిపురుష్ లాంటి మైథలాజికల్ ప్రాజెక్టులోనూ మెలోడీ సాంగులను స్పెషల్‌గానే ట్రీట్ చేస్తున్నారు. సినిమా సక్సెస్‌లో మెలోడీస్కి మెగా పార్ట్ ఉందన్న విషయాన్ని మర్చిపోవట్లేదు మన మ్యూజిక్ డైరక్టర్లు.