MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..

MI vs KKR: రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై..


Mumbai Indians vs Kolkata Knight Riders, 12th Match: ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ అందించిన 117 పరుగుల టార్గెట్‌ను కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై తరపున అరంగేట్రం చేసిన అశ్విని కుమార్ 3 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

ముంబై ఇండియన్స్ తరపున ర్యాన్ రికెల్టన్ 62 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 27 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ (13 పరుగులు)మరోసారి నిరాశ పరచగా, విల్ జాక్స్ (16 పరుగులు) కూడా రోహిత్ బాటలోనే ఆకట్టుకోలేకపోయాడు.

ముంబై బౌలర్లలో అశ్విన్ ఆండ్రీ రస్సెల్ (5 పరుగులు), మనీష్ పాండే (19 పరుగులు), రింకు సింగ్ (17 పరుగులు), కెప్టెన్ అజింక్య రహానె (11 పరుగులు)లను పెవిలియన్‌కు పంపాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేశ్ పుత్తూర్, మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కోల్‌కతా జట్టులో అంగ్‌క్రిష్ రఘువంశీ అత్యధికంగా 26 పరుగులు చేయగా, రమణ్‌దీప్ సింగ్ 22 పరుగులు చేశాడు.

ప్లేయింగ్-11..

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్) , క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, అంగ్‌క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా మరియు వరుణ్ చక్రవర్తి.
ప్రభావం: మనీష్ పాండే.

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్ మరియు విఘ్నేశ్ పుత్తూర్. ప్రభావం: రోహిత్ శర్మ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *