MI vs RCB Match Result: 3620 రోజుల తర్వాత.. ముంబైకి వడ్డీతో ఇచ్చిపడేసిన బెంగళూరు

MI vs RCB Match Result: 3620 రోజుల తర్వాత.. ముంబైకి వడ్డీతో ఇచ్చిపడేసిన బెంగళూరు


Mumbai Indians vs Royal Challengers Bengaluru, 20th Match Match Result: ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం జరిగిన 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో 10 ఏళ్ల తర్వాత అంటే 3620 రోజుల వాంఖడేలో బెంగళూరు టీం అద్భుత విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి విజయం 2015 సీజన్‌లో వచ్చింది. 222 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబై జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది.

టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (67 పరుగులు), కెప్టెన్ రజత్ పాటిదార్ (64 పరుగులు) అర్ధ సెంచరీలు సాధించారు. జితేష్ శర్మ అజేయంగా 40 పరుగులు మరియు దేవదత్ పడిక్కల్ 37 పరుగులు అందించారు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు పడగొట్టారు. విఘ్నేష్ పుత్తూరు ఒక వికెట్ పడగొట్టాడు.

ఇరు జట్ల ప్లేయింగ్ 11..

ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా మరియు విఘ్నేష్ పుత్తూర్. ఇంపాక్ట్ ప్లేయర్: రోహిత్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *