Mobile Production: నాలుగేళ్లలో భారీగా పెరిగిన మొబైల్ ఉత్పత్తులు.. రాజ్యసభలో మంత్రి గోయల్

Mobile Production: నాలుగేళ్లలో భారీగా పెరిగిన మొబైల్ ఉత్పత్తులు.. రాజ్యసభలో మంత్రి గోయల్


Mobile Production: భారతదేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి విలువ పరంగా దాదాపు 146 శాతం పెరిగి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.2,13,773 కోట్ల నుండి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,25,000 కోట్లకు పెరిగిందని మంగళవారం పార్లమెంటుకు సమాచారం అందించారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్. ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు విలువ పరంగా దాదాపు 775 శాతం పెరిగి 2020-21లో రూ.22,870 కోట్ల నుండి 2024-25లో రూ.2,00,000 కోట్లకు చేరుకున్నాయి.

ప్రభుత్వ పీఎల్‌ఐ (PLI), జాతీయ పారిశ్రామిక కారిడార్ పథకాలు దేశీయ తయారీని ప్రోత్సహించాయని, ఉత్పత్తి పెరుగుదలకు, ఉద్యోగాల భర్తికి, ఎగుమతులకు ఊతం ఇచ్చాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, వివిధ రంగాలలో ఎగుమతులను పెంచడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక స్కీమ్‌? ఇది భారతదేశంలో తయారయ్యే ఉత్పత్తుల నుండి పెరుగుతున్న అమ్మకాల ఆధారంగా కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. విదేశీ, స్థానిక కంపెనీలు తమ తయారీ యూనిట్లను స్థాపించడానికి లేదా విస్తరించడానికి, ఉపాధిని సృష్టించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఈ పథకం లక్ష్యం.

ఫలితంగా భారతదేశం ఒక ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ దేశంగా మారింది. PLI పథకం కారణంగా ఫార్మా రంగంలో ముడి పదార్థాల దిగుమతులు కూడా గణనీయంగా తగ్గాయి. పెన్సిలిన్-జితో సహా భారతదేశంలో ప్రత్యేకమైన పదార్థాలు, బల్క్ ఔషధాలు తయారు చేయబడుతున్నాయని అన్నారు. (CT స్కాన్, MRI మొదలైనవి) వంటి వైద్య పరికరాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడిందన్నారు.

భారతదేశంలో ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడీ లైట్ల పరిశ్రమ కోసం బలమైన కాంపోనెంట్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న వైట్ గూడ్స్ కోసం PLI పథకం అని, దేశాన్ని ప్రపంచ సరఫరా గొలుసులలో అంతర్భాగంగా మార్చే లక్ష్యంతో ఉందన్నారు.

ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని, ఇది ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలలో అమలు చేసిన 27 రంగాలపై దృష్టి సారించిందన్నారు. దేశంలో తయారీ పెట్టుబడులను సులభతరం చేయడానికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామన్నారు.

నేషనల్‌ ఇండస్ట్రీస్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NICDP) కింద మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 28,602 కోట్లతో ప్రభుత్వం 12 కొత్త ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలతో పాటు తయారీని ప్రోత్సహించడానికి జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్, జాతీయ సింగిల్ విండో సిస్టమ్ సాఫ్ట్ లాంచ్ మొదలైన వాటి కింద పెట్టుబడి అవకాశాలను అందిస్తుందని మంత్రి తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *