Money Handling Mistakes: డబ్బును ఎలా లెక్కిస్తున్నారు..? ఈ తప్పులు చేస్తున్నారా..?

Money Handling Mistakes: డబ్బును ఎలా లెక్కిస్తున్నారు..? ఈ తప్పులు చేస్తున్నారా..?


Money Handling Mistakes: డబ్బును ఎలా లెక్కిస్తున్నారు..? ఈ తప్పులు చేస్తున్నారా..?

మన రోజువారీ జీవితంలో డబ్బును సరైన విధంగా నిర్వహించడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం ప్రకారం.. డబ్బును లెక్కించే పద్ధతులు, నిల్వ చేసే స్థలాలు, నిర్వహణపై చిన్న తప్పులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోయే అవకాశాలను పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బును లెక్కించే సమయంలో కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం ద్వారా సంపదను కాపాడుకోవచ్చు.

డబ్బును లెక్కించే పద్ధతులు

డబ్బును లెక్కించే సమయంలో చాలా మంది నాలుకతో వేలిని తడిపి నోట్లను లెక్కిస్తుంటారు. ఇది శుభప్రదం కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కోపించడమే కాకుండా ఇది అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఒక చిన్న గ్లాసులో నీటిని పక్కన ఉంచుకుని వేళ్లను తడిపి నోట్లను లెక్కించడం ఉత్తమం.

పర్సులో ఆహార పదార్థాలు

పర్సులో చాక్లెట్లు, నూనె ప్యాకెట్లు లేదా ఇతర ఆహార పదార్థాలను ఉంచడం వల్ల సంపదపై చెడు ప్రభావం పడుతుంది. పర్సులో డబ్బు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం.. పర్సు శుభ్రంగా ఉండాలి, అలాగే అది గోధుమ లేదా ఎరుపు రంగులో ఉండడం మంచి ఫలితాలను అందిస్తుందట.

డబ్బు నిర్వహణపై జాగ్రత్తలు

డబ్బును ఎక్కడపడితే అక్కడపెట్టడం శ్రేయస్కరం కాదు. ప్రత్యేకంగా డబ్బు నిల్వ చేసేందుకు ఒక శుభ్రమైన అల్మరా లేదా బీరువాను ఉపయోగించాలి. వంటగదిలోని వస్తువుల్లో డబ్బు పెట్టడం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డబ్బును ఇవ్వడం, పంచడం

పేదలకు సహాయం చేయడంలో మీ సొంత చేతులతోనే డబ్బు ఇవ్వాలి. డబ్బును చులకనగా విసిరేయడం లేదా తక్కువగా చూడడం అనవసరం. ఇది సంపదను తగ్గించడమే కాకుండా మీపై దురదృష్టాన్ని కలిగించవచ్చు.

రాత్రి వేళల్లో డబ్బు

రాత్రిపూట డబ్బును మంచంపై ఉంచడం శుభప్రదం కాదు. డబ్బును శుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. కిందపడిపోయిన డబ్బును తీసుకునే ముందు లక్ష్మీదేవిని ఆరాధించి, అది సంపద మీద సక్రమమైన గౌరవం చూపినట్లుగా భావించాలి.

లక్ష్మీదేవిని ఆరాధించండి

సంపదపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆరాధన చేయడం మంచిది. సంపదను శుభ్రంగా, గౌరవంగా నిర్వహించడమే లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి మార్గం. ఈ సూచనలు పాటించడం ద్వారా సంపద కాపాడుకోవడమే కాకుండా.. శ్రేయస్సు పొందగలుగుతారు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *