MS Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏంటంటే?

MS Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏంటంటే?


MS Dhoni: వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోని.. జార్ఖండ్ ప్రభుత్వం సీరియస్.. అసలు విషయం ఏంటంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి రాంచీలోని ఆయన పాత ఇంటి సంబంధించిన వార్తల్లో నిలిచారు. మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం అతనికి రాంచీలో 10,000 చదరపు అడుగుల స్థలాన్ని గతంలో ఇచ్చింది.

ఈ స్థలంలో మహేంద్ర సింగ్ ధోనీ విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇక్కడి వరకు ఏ సమస్య లేదు. అయితే ఈ ఇంటిని ధోనీ కమర్షియల్ అవసరాల కోసం వాడుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి. రాంచీలోని హర్ము రోడ్‌లోని ధోనీ ఇంట్లో డయాగ్నస్టిక్ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు సమాచారం. దీనిపై హౌసింగ్ బోర్డుకు ఫిర్యాదు వచ్చింది. దీంతో తాజాగా జార్ఖండ్ హౌసింగ్ బోర్డు ధోనీని వివరణ కోరింది.

జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం, రెసిడెన్షియల్ ప్లాట్‌లను వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించకూడదు. ఏదైనా సందర్భంలో అలా చేస్తే చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా జార్ఖండ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ సంజయ్ లాల్ పాశ్వాన్ మాట్లాడుతూ.. విచారణ ప్రారంభించామని, ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధోనీ ఇల్లు వివాదాలకు గురికావడం ఇదే తొలిసారి కాదు. కొన్నేళ్ల క్రితం ధోనీ ఈ ఇంటి పైకప్పుపై స్విమ్మింగ్ పూల్ నిర్మించాడు. ఈ విషయమై 2007లో ఫిర్యాదు వచ్చింది. 2016లో నగరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు ధోనీ తన స్విమ్మింగ్ పూల్‌లో ప్రతిరోజూ 15 వేల లీటర్ల నీటిని వాడుకునేవాడు. దీంతో తమ ఇంటికి సరైన నీరు అందడం లేదని ఆరోపణలు వినిపించాయి.

ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ధోనీ కమర్షియల్ అవసరాలకు వినియోగించుకుంటున్నాడని తాజాగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతంధోనీ ఈ ఇంట్లో నివసించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సిమాలియాలో తన కుటుంబంతో కలిసి రింగ్ రోడ్‌లోని వారి భారీ ఫామ్‌హౌస్‌లో ఉంటున్నాడు.

ఇది చదవండి: క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *